బాలీవుడ్ న్యూస్‌టుడే: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ”యు ఫైట్ ఫర్ వాట్ యు లవ్” అనేది ఉప శీర్షిక. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 17న నాలుగు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో విడుదల చేయనున్నారు. సామాజిక బాధ్యత ఉన్న యువకుని పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తారు. ఈ చిత్రానికి జస్టిస్ ప్రభాకరన్ సంగీతం, సుజీత్ సారంగ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి.

No comments:
Post a Comment