Monday, March 11, 2019

అదే మాట… అదే చర్చ…


       ఒంగోలు న్యూస్‌టుడే:
 జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులు దాదాపు ఖరారు కాగా   సంతనూతలపాడు అసమ్మతి నాయకులు బెట్టు వీడలేదు. సుజనా చౌదరితో చర్చ సందర్భంగానూ నాయకులు తెగేసి చెప్పారు. విజయ్‌కుమార్‌ పట్ల తమ వ్యతిరేకతకు కారణాలను వివరించారు. సోమవారం భేటీలు రెండు దశల్లో జరిగాయి. తొలిదశలో నాయకులందరితోనూ ఒకేచోట సుజనా సమావేశమయ్యారు. అసమ్మతికి కారణాలు తెలుసుకుని నోట్‌ చేసుకున్నారు. ఈ భేటీ రెండున్నర గంటల పాటు జరిగింది. తర్వాత దశలో ఒక్కో నాయకుడిని లోపలికి పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగానూ వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? స్పష్టమైన కారణాలు, పరిష్కార మార్గాలపై చర్చించినట్లు తెలిసింది. ఇదే సందర్భంలో ప్రత్యామ్నాయం ఎవరైతే బాగుంటుంది? అనే ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ భేటీలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో ఇక్కడ నాయకులు, కార్యకర్తలు కొందరికి ఐవీఆర్‌ఎస్‌ ఫోన్లు వచ్చాయి. సంతనూతలపాడు అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది? అంటూ విజయ్‌కుమార్, ఎరిక్షన్‌ బాబుల పేర్లు ఇచ్చారు. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈ అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ నివేదికలు, సుజనా బృందం ఇచ్చే తుది నివేదికల ఆధారంగా చంద్రబాబు మంగళవారం నాటికి అభ్యర్థిని ఖరారు చేయనున్నారని తెలిసింది.

No comments:

Post a Comment