పేరాల:
- చీరాలలోని కారంచేడు రహదారిలోని కాలువలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు….
- రెండో పట్టణ సీఐ రాజమోహనరావు తెలిపిన వివరాల ప్రకారం….
- కారంచేడు రహదారిలో చిల్లచెట్ల మధ్య ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు….
వీఆర్వో జోషి సమక్షంలో మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుని వద్ద లభించిన ఆధార్ కార్డు ద్వారా అతనిది గుంటూరు జిల్లా లక్కరాజు గార్లపాడుకు చెందిన వీరాంజనేయులుగా గుర్తించారు. మృతదేహం వద్ద పురుగుల మందు సీసా ఉంది. మూడు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

No comments:
Post a Comment