Monday, March 11, 2019

నగదు, మద్యం అక్రమ రవాణాపై దృష్టి …

ఒంగోలు  న్యూస్‌టుడే:
 ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లాకు సరిహద్దులుగా ఉన్న నెల్లూరు, కర్నూలు, కడప, గుంటూరు సరిహద్దుల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రాజకీయ పార్టీలు మద్యం, నగదు పంపిణీ వంటి చర్యలకు పాల్పడుతుంటాయి. వీటిని నిలువరించేందుకు పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది. సాయుధ బలగాలతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ రేయింబవళ్లూ తనిఖీలు చేపట్టనుంది.   

No comments:

Post a Comment