ఒంగోలు న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్.
2.సమావేశంలో పొగాకు బోర్డు మాజీ ఉపాధ్యాక్షుడు పమ్మి బద్రిరెడ్డి .
వర్షాభావ పరిస్థితులు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పొగాకు కిలో సరాసరి ధర రూ.150 చొప్పున చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతునాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. గిట్టుబాటు ధరల విషయమై జిల్లాలోని అన్ని వేలం కేంద్రాలకు చెందిన రైతునాయకులు రామనగర్‌లోని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో గురువారం సమావేశమయ్యారు. పొగాకు కిలో రూ.120కి తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. వేలం ప్రారంభం నాటి నుంచే అన్ని గ్రేడుల పొగాకును కొనుగోలు చేయడంతోపాటు, అమ్మకాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

No comments:
Post a Comment