కర్నూలు న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..
*భాజపా తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు..
ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా, వైకాపాలు రెండు అవినీతి పార్టీలే అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కో ఇన్‌ఛార్జి సునీల్ ధియోదర్ అన్నారు. స్థానిక దేవనగర్‌లో భాజపా కర్నూలు పార్లమెంటరీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా ఏనాడు ఓంటరిగా పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవని, ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చి ఓట్ల రాజకీయం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డబ్బులు వెదజల్లి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రజల ఓటింగ్ తీరు మారిందని, భాజపా తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. మరో రెండేళ్లల్లో చంద్రబాబు జైలుకు వెళ్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారధి మాట్లాడుతూ దేశానికి కాపాలదారుడిగా ఉంటానన్నా మోదీ.. మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ నరసింహరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శులు కుణిగిరి నీలకంఠ, హరినాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు కాళింగి నరసింహావర్మ, సుబ్బారెడ్డి, రామస్వామి పాల్గొన్నారు.

No comments:
Post a Comment