కృష్ణాజిల్లా: అవనిగడ్డ: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
* రోడ్ షోలో జగన్ మాట్లాడుట…
* బాహుబలి సినిమా సెట్టింగులతో కాలం గడుపుట…
వైసీపీ ని గెలిపిస్తే మళ్ళీ రాజన్న రాజ్యం తెస్తానని వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణాజిల్లాలో అవనిగడ్డలో నిర్వహిస్తున్న రోడ్ షోలో మాట్లాడుతూ ప్రజలందరికీ ఒకే న్యాయం జరగాలంటే రాజన్న రాజ్యం రావాల్సిందేనన్నారు. రాజధాని అమరావతిని సింగపూర్ చేస్తానన్నారు. ఏమైందని అన్నారు. బాహుబలి సినిమా సెట్టింగ్ లతో కాలం గడిపారన్నారు. రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కూడా లేదన్నారు. దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేశారన్నారు. తాంత్రిక పూజలతో ఆలయాన్ని భ్రష్టు పట్టించారన్నారు. కోట్ల రూపాయలు విలువైన ఇసుకను దోచేశారన్నారు. ఇసుక ఎక్కడైనా ఉచితంగా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
No comments:
Post a Comment