Monday, March 18, 2019

పబ్‌జి ప్రాణంతకం ఎవరి కి పట్టదా …? దీనికి చెప్పాలి స్వస్థి ….


 ముంబై న్యూస్‌టుడే:
**పబ్‌జీ గేమ్‌ ఆడుతూ మహారాష్ట్రలో ఇద్దరు యువకులు మృతి . 
పబ్‌జీ గేమ్‌ ఆడుతూ మహారాష్ట్రలో ఇద్దరు యువకులు రైలు కింద పడి చనిపోయారు. ఈ దుర్ఘటన శనివారం సాయంత్రం జరిగింది. నగేశ్‌ గోరే, స్వప్నిల్‌ అన్నపూర్ణే అనే యువకులు శనివారం సాయంత్రం రైలు పట్టాలపై కూర్చుని పబ్‌జీ ఆడుతూ ఆటలోనే లీనమయ్యారు. రైలు రావడాన్ని కూడా వారు గమనించలేదు. రైలు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

No comments:

Post a Comment