Sunday, March 17, 2019

అటవీప్రాంతంలో నక్సలైట్లు కలకలం….

పాట్నా న్యూస్‌టుడే : ముఖ్యంశాలు….
*బీహార్ ఎన్‌కౌంటర్…..
*నక్సలైట్ మృతి……
బీహార్ రాష్ట్రంలోని నవడా అటవీ ప్రాంతంలో నక్సలైట్లకు, కోబ్రా ప్రత్యేక పోలీసు దళానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సోమవారం ఉదయం నవడా అటవీప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారం మేర కోబ్రా 205 ప్రత్యేక పోలీసు దళం దాడి చేసింది. నక్సలైట్లు పోలీసులపై కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ లో ఓ నక్సలైట్ మృతి చెందాడు. పోలీసులు అటవీఫ్రాంతంలో గాలిస్తున్నారు.

No comments:

Post a Comment