ముంబాయి న్యూస్‌టుడే:
*అత్త మరణంతో ఆనందం వ్యక్తం చేసిన కోడలు ..
*నా తల్లి చనిపోతే ఆనందపడతావు అంటూ ఆమె భర్త చంపేశాడు..
అత్తమరణంతో ఆనందం వ్యక్తం చేసిన కోడలు హత్యకు గురైంది. ఓ పక్క నా తల్లి చనిపోతే ఆనందపడతావు అంటూ ఆమె భర్త అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తు నుండి తోసి చంపేసానని పోలీసులు తెలిపారు. పశ్చిమ మహరాష్ట్రలోని జూనా రాజ్‌వాడ పోలిస్టేషన్ పరిధిలో మార్చి 9 న దుర్ఘటన జరిగింది అన్నారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో భాధపడుతున్న మాలతి అనే వృద్ధురాలు మార్చి 9 న చనిపోయింది దీనితో ఆమె కోడలు శుభంగిలోఖండే ఎంతో ఆనందపడింది. ఆ ఆనందాన్ని మనసులో దాచుకోలేక పోయింది మాటల్లో వ్యక్తం చేయడంతో ఆమె భర్త పట్టరాని కోపంతో శుభంగిలోఖండేను రెండవ అంతస్తు నుండి తోసి చంపేశాడు. అత్త మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కోడలు అని మొదట్లో స్థానిక మీడియా కూడా వార్తలు ప్రసారం చేసింది .ఈ అనుమానాస్పద మృతిపై పోలిసులు దర్యాప్తు జరపడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది.

No comments:
Post a Comment