Wednesday, March 6, 2019

రూ.9 లక్షలతో అరకు కాఫీ స్టాల్‌ ఏర్పాటు…..

శ్రీకాకుళం(సీతంపేట),న్యూస్‌టుడే:
  పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న స్థలంలో రూ.9 లక్షలతో అరకు కాఫీ దుకాణం(స్టాల్‌)ను ఏర్పాటు చేస్తామని ఐటీడీఏ పీవో ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. బుధవారం దీనికి సంబంధించి గుర్తించిన స్థలంలో కొలతలు వేయించి తగు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ జీసీసీ ఆధ్వర్యంలో దీనికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ మురళి, ఏపీవో లోకనాధం ఆనందరావు, ఏఈఈ మోహన్‌గోపాల్, డీపీవో వై.సతీష్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment