Friday, March 15, 2019

61,422 మంది విద్యార్ధులకు 270 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు


గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
*  ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలు
జిల్లాలో ఈ నెల 18 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలను విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ఎస్ గంగాభవాని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని డివిజన్‌ల అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సూచనలు జారీ చేశారు. జిల్లాలో ఈ విద్యాసంవత్సరం సాధారణ, ఒకేషనల్, ఓరియంటల్‌కు చెందిన మొత్తం 61,422 మంది పరీక్షలు రాస్తుండగా వారిలో బాలురు 31,897 మంది, బాలికలు 29,525 మంది ఉన్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు, 270 కేంద్రాలుగా గుర్తించామని పేర్కొన్నారు.
                                                                                                 

No comments:

Post a Comment