Thursday, March 14, 2019

రూ.50 లక్షలతో ఉన్న నగదు పెట్టె………..


శ్రీకాకుళం,(వనవిష్ణుపురం)న్యూస్‌టుడే:  
 
*కారులో ఉన్న నగదు పెట్టె………. 
*తనిఖీల్లో  రూ 50 లక్షలు  నగదు………
*బ్యాంకు తరలింపు…. 
 పోలాకి మండలం వనవిష్ణుపురంలోని తనిఖీ కేంద్రం వద్ద బుధవారం సాయంత్రం తనిఖీ ఉద్యోగుల తనిఖీల్లో ఏ విధమైన ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.50 లక్షల నగదుపట్టుబడింది.సాధారణ రేకుపెట్టెకు తాళం వేసి ఉండడంతో దానిని తీసి తనిఖీకి సహకరించాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న డీటీ అప్పారావు కారులోని వ్యక్తులను కోరారు.తాము ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు ఉద్యోగులమని, బ్యాంకు అవసరాలకు నగదు తీసుకెళుతున్నట్లు తెలిపారు. దీంతో డీటీ కాగితాలు చూపాలని కోరగా లేవనడంతో అనుమానం వచ్చి నగదును పట్టుకున్నారు. దీంతో కారులో ఉన్న క్షేత్రసహాయకుడు విశ్వేశ్వరరావు కాగితాలు తెచ్చి చూపారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు ఎం.లక్ష్మి సంఘటనాస్థలానికి చేరుకుని కాగితాలను పరిశీలించి బ్యాంకు సిబ్బందితో మాట్లాడారు. నరసన్నపేట ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు నుంచి రూ. 50 లక్షల మొత్తాన్ని బోరుభద్ర బ్యాంకు శాఖకు తెస్తున్నట్లు బ్యాంకు సిబ్బంది ఆమెకు వివరించారు. దీంతో వారితోపాటు నగదుతో ఉన్న వాహనాన్ని విడిచిపెట్టారు.

No comments:

Post a Comment