పెనుగంచిప్రోలు న్యూస్‌టుడే:ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ అత్తులూరి అచ్యుతరావు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన గోడప్రతులను ధర్మకర్తలు, ఆలయ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. 21న తిరునాళ్లు ప్రారంభం, 22న సామూహిక కుంకుమార్చన, 23న గ్రామోత్సవం, 24న దివ్యప్రభోత్సవం, 25న పుట్టింటి పసుపు కుంకుమ ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు గింజుపల్లి గోపిచంద్, వసంతరావు, బాడిశ కుటుంబరావు, అక్కమ్మ, ఏఈవో జంగం శ్రీనివాస్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment