Monday, March 18, 2019

పాలిసెట్-2019 పరీక్షకు దరఖాస్తులు….


 న్యూస్‌టుడే:
*ఎన్నికల నేపథ్యంలో పరీక్షల్లో వచ్చిన మార్పు.
*ఏప్రిల్ 21లోపు  దరఖాస్తు చేసుకోవాలి.
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్-2019 పరీక్ష  ఎన్నికల నేపథ్యంలో మార్పు చేసినట్లు తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్.కృష్ణ సాయి తెలిపారు.వివరాలు…..ఏప్రిల్ 12న జరగాల్సిన పాలిసెట్ పరీక్ష ఏప్రిల్ 30కు మార్పు చేసినట్లు వివరించారు.పాలిసెట్ అప్లికేషన్ కావాల్సిన విద్యార్థులు తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో  రూ.400 చెల్లించి పొందాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేసుకున్న వారికి రెండు రోజుల్లో హాల్‌టికెట్లు అందజేస్తామన్నారు.విద్యార్థులు పదో తరగతి హాల్‌టికెట్,ఆధార్ జిరాక్స్,పాస్‌పోర్ట్ ఫోటో తీసుకుని ఏప్రిల్ 21లోపు  దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment