గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
- ఉపాధ్యాయ నియమకాలకు రంగం సిద్ధం… మే 15 నాటికి కొత్త టీచర్లకు ఉత్తర్వులు జారి…
- డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ(డీఎస్సీ) ల ద్వారా 8,504 ఉపాధ్యాయ నియమకాలకు రంగం సిద్ధమవుతోంది.
వీటిలో 7, 902 జనరల్ డీఎస్సీలో నోటిపై చేసిన పోస్టులు కాగా, 602 స్పెషల్ డీఎస్సీలో నోటిపై చేసిన పోస్టులు ఉన్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోగానే నియామకాలు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల ఏప్రిల్11న జరగనున్నందున ఆ తర్వాత షెడ్యూల్ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం డీఎస్సీ నియామకాలు మే 15 నాటికి పూర్తిచేసి కొత్త టీచర్లకు ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

No comments:
Post a Comment