కర్నూలు న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 10 నుంచి ఆరంభం కానున్నాయి. నాలుగు రోజుల్లో ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో ఆలయ నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగువ, దిగువ ఆలయాల ఆవరణంలో చలువ పందిరిలు ఏర్పాటు చేశారు. దిగువ అహోబిలంలోని కొనేరులో నీటిని నింపి స్వామి తెప్పోత్సవానికి సిద్ధం చేశారు. అహోబిలానికి వెళ్లే దారిలో గండ్లేరు నుంచి 7 కి.మీ మేర ఉన్న రోడ్డుకు ఇరువైపులా ఉన్న గుంతలను ఆర్అండ్‌బీ అధికారులు జేసీబీ సాయంతో మట్టిని చదును చేయించారు.
No comments:
Post a Comment