Thursday, March 7, 2019

కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం


విజయనగరం న్యూస్‌టుడే:
  • ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొనేందుకు ఇంజనీరింగ్ విద్యార్ధులు ఆయా రంగాల్లో దూసుకుపోవాలని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ ఎన్.పి.దుబే అన్నారు.
  • కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం డెంకాడ మండలం లోని జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజనీరింగు కళాశాలలో సీఎస్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రస్ధాయి క్విజ్‌ పోటీలు నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దుబే మాట్లాడుతూ నేటి యువతరం ఉపాధి అవకాశాలను ఎంత సులువుగా అందుకుంటుందో వివరించారు.
  • ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం యువత ఆయా రంగాల్లో ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.

No comments:

Post a Comment