Wednesday, March 20, 2019

ఆటగాళ్లు తేలారు అదరగొట్టేదెవరు……..!


విశాఖ న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..
*ప్రధాన పార్టీలు సిట్టింగులతోనే రంగంలోకి…..
*తొలిసారి బరిలోకి ఉత్సాహంగా జనసేన…..
లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల మైదానంలో తలపడే జట్లు ఆటగాళ్ల పేర్లను ప్రకటించేశాయి. వారిలో పోటీ ఇచ్చేవారు ఎవరో.. గెలుచుకొచ్చే పందెం కోళ్లు ఏవో ప్రధాన పార్టీలు అంచనాలకు వస్తున్నాయి. పోరు దగ్గర పడుతుండడంతో ప్రచారాస్త్రాలకు పదును పెడుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు పోటీలోకి దిగితే ఈ సారి అయిదు పార్టీల నుంచి అభ్యర్థులు పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్షం వైకాపాతోపాటు జనసేన, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. వీటికి తోడు కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ, కొత్తపల్లి గీత స్థాపించిన జనజాగృతి పార్టీల నుంచి అభ్యర్థులను పోటీలో నిలపడానికి ఉత్సుకత చూపుతున్నారు. స్వతంత్రులు ఎలాగూ వీరికి అదనంగా ఉంటారు. మొత్తంగా సార్వత్రిక సమరానికి అన్ని పార్టీలు సై అంటూ దూసుకుపోతున్నాయి.

No comments:

Post a Comment