Monday, March 11, 2019

ఎమ్‌సెట్,ఈ సెట్ దరఖాస్తుల ఆహ్వానం……


  శ్రీకాకుళం,న్యూస్‌టుడే,:
1.2019 ప్రవేశ పరీక్షకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల…
2.ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి  హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చ……
  ఏయూ ప్రాంగణం, పీజీ, సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎమ్‌సెట్,ఈ సెట్ -2019 ప్రవేశ పరీక్షకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 15 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఆసెట్‌, రూ.1500 వరకు అపరాధ రుసుంతో ఆఈట్‌ ఏప్రిల్‌ 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులో దొర్లిన తప్పులను ఏప్రిల్‌ 25 నుంచి 27 వరకు సరిచేసుకునే అవకాశం కల్పిస్తారు. వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చ  మే 5 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. అదే నెల 15న ఫలితాలు విడుదల చేస్తారు. మే నెల 26వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తారు. ఈ మేరకు ఏయూ ఒక ప్రకటన విడుదల చేసింది.

No comments:

Post a Comment