కర్నూలు న్యూస్‌టుడే:
- తెదేపా నంద్యాల ఎంపీ సీటు నాకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ ఎస్పీవై రెడ్డి …
- తమకు ముఖ్యమంత్రి ఎంపీ టిక్కెట్ ఇస్తారనే నమ్మకం ఉందన్నారు…
తెదేపా నంద్యాల ఎంపీ సీటు తనకే వస్తుందని ఎంపీ ఎస్పీవై రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని బొమ్మల సత్రంలో ఉన్న కార్యాలయంలో ఆదివారం జరిగిన నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని తెదేపా కార్యకర్తలు, అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశాన్ని పట్టణ తెదేపా అధ్యక్షుడు సలాముల్లా అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో 10 రోజుల కిందట మాట్లాడినట్లు చెప్పారు. నంద్యాల శాసనసభ, పార్లమెంటు టిక్కెట్లు అడిగానన్నారు. ఒక్కటి తప్పకుండా ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. తమకు ముఖ్యమంత్రి ఎంపీ టిక్కెట్ ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. తెదేపా, సీఎం చేయించిన సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయన్నారు. గతంలో తన విజయానికి ఏవిధంగా సహాయ సహకారం అందించారో రాబోయో ఎన్నికల్లో అలాగే మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు.
No comments:
Post a Comment