Thursday, March 14, 2019

ఎలక్షన్ తేదీ ముగింపు వరకు పాటు పడాలి…


గుంటూరు న్యూస్‌టుడే:
*అన్ని స్థాయిల్లో శ్రేణులు సమన్వయంగా పని చేయుట. 
*చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించుట.
26 రోజులు టీడీపీ కార్యకర్తలు, నేతలు కష్టపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. మిక్షన్ ఎలక్షన్ 2019పై ప్రజాప్రతి నిధులు, బూత్ కన్వినర్లు, పార్టీ బాధ్యులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ తో సీఎం చంద్రబాబు మాట్లాడారు.. అన్ని స్థాయిల్లో శ్రేణులు సమన్వయంగా పని చేయాలన్నారు. మనం చేసిన అభివృద్ధి సంక్షేమం వివరించాలన్నారు. ఎన్నడూ లేనంత ఉత్సాహం టీడీపీ కార్యకర్తలో ఉందన్నారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై పూర్తి  సానుకూలత ఉందని పేర్కొన్నారు. కోటిమంది మహిళలకు పసుపు-కుంకుమ, ప్రతి రైతు కుటుంబానికి లక్షలాది రూపాయలు లబ్ధి చేకూర్చమని, యువతారానికి భవిష్యత్ పట్ల భరోసా కల్పిస్తున్నామన్నారు. వచ్చే 5 ఏళ్లు ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. 

No comments:

Post a Comment