కావలసినవి:
- గుడ్లు: నాలుగు,
- ఉల్లిముద్ద: కప్పు,
- టొమాటో గుజ్జు: రెండు కప్పులు (ముద్దలా చేయాలి),
- సెనగపిండి: 2 టేబుల్‌స్పూన్లు,
- అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు,
- కొత్తిమీర తురుము: టీస్పూను,
- కారం: టేబుల్‌స్పూను,
- గరంమసాలా: టీస్పూను,
- నూనె: 2 టేబుల్‌స్పూన్లు,
- కొబ్బరిపాలు: కప్పు,
- పసుపు: అరటీస్పూను,
- జీలకర్ర: టీస్పూను,
- ఉప్పు: తగినంత,
తయారుచేసే విధానం:
గుడ్లసొనలో సెనగపిండి, చిటికెడు ఉప్పు, కొత్తిమీర తురుము వేసి బాగా గిలకొట్టాలి. చిన్నసైజు పాన్‌లో 2 టీస్పూన్ల నూనెవేసి గుడ్డుసొన మిశ్రమంవేసి మూతపెట్టి సుమారు అర అంగుళం మందం ఉండేలా ఆమ్లెట్ వేసి తీసి, చదరపు ముక్కల్లా కోసి పక్కన ఉంచాలి. బాణలిలో మిగిలిన నూనె వేసి కాగాక జీలకర్రవేసి వేయాలి. ఉల్లిముద్ద వేసి వేగాక టొమాటో గుజ్జు, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. తరవాత సుమారు కప్పు నీళ్లు, కొబ్బరిపాలు పోయాలి. ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా వేసి కలిపి దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి. చివరగా ఆమ్లెట్ ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి.

No comments:
Post a Comment