Tuesday, March 19, 2019

పన్ను వసూళ్లు వేగవంతం చేయండి….


భాస్కరపురం (మచిలీపట్నం) న్యూస్‌టుడే :ముఖ్యంశాలు:
*సోమవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో బందరు, ఉయ్యూరు..
జిల్లాలోని పలు ప్రాంతాలలో పన్ను వసూళ్ల్ల ప్రక్రియను వేగవంతం చేయాలని పురపరిపాలనశాఖ ప్రాంతీయ డైరెక్టర్‌ ఆర్డీ, జి.నాగరాజు అధికారులను ఆదేశించారు.
సోమవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో బందరు, ఉయ్యూరు, పెడన పురపాలక సంఘ అధికారులతో పన్ను వసూళ్ల్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31వ తేదీ లోగా పన్నులు బకాయిలు చెల్లించాలని అలా ఒకేసారి బకాయి చెల్లించిన వారికి వడ్డీలో రాయితీ ఇచ్చామని తెలిపారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు పురపాలకశాఖ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ పీజెె.సంపత్‌కుమార్, ఆర్వో, ఆర్‌ఐలు, బిల్‌కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

No comments:

Post a Comment