న్యూస్‌టుడే:
1)టి న్యూస్ 10అన్ లైన్ ఎడిషన్.
2)ఈవీఎంలపై విస్తృత స్థాయి శిక్షణే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబు
3)మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పోలింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు
శ్రీకాకుళం,న్యూస్‌టుడే:ఈవీఎం లపై విస్తృత స్థాయి శిక్షణే లక్ష్యంగా అధికారులంతా పనిచేయాలని సంయుక్త కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో బుధవారం ఎన్నికల నోడల్ అధికారులు,బృంద సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లా మొత్తం మీద ఎన్నికల విధుల కోసం ఉన్న సిబ్బంది గురించి ఆరా తీశారు. అవసరమైతే బ్యాంకు ఉద్యోగులను కూడా వినియోగించాలని సూచించారు. మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పోలింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి నరేంద్రప్రసాద్‌ను ఆదేశించారు.సమావేశంలో సంయుక్త కలెక్టర్-2 పి.రజనీకాంతరావు, జడ్పీ సీఈవో కైలాస్‌గిరీశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్.శ్రీరాములునాయుడు, డీఎస్‌వో కృష్ణారావు, గృహనిర్మాణ సంస్థ పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment