శ్రీకాకుళం న్యూస్‌టుడే:
1)టీ న్యూస్ 10 ఆన్ లైన్ ఎడిషన్
2)వారం రోజుల నుంచి భోజనం బాగుండటం లేదని ఆందోళన.
3)90శాతం మంది విద్యార్ధులు ఆకలితో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం
3)90శాతం మంది విద్యార్ధులు ఆకలితో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం
రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు వారం రోజుల నుంచి భోజనం బాగుండటం లేదని తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు.చినరావుపల్లి సమీపంలోని మిత్ర ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులంతా గురువారం ఉదయం అల్పాహారం(టిఫిన్) చేయకుండా ఎండలో ధర్నా చేశారు. అన్నం, కూరలు, సాంబారు బాగుండటం లేదని దీంతో 90శాతం మంది విద్యార్థులు తినలేక ఆకలితో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతిరోజూ భోజనం బాగుండటం లేదని మార్చాలని కోరుతున్నా కనీస స్పందన లేదని ఆరోపించారు.దీంతో స్టూడెంట్ అఫైర్స్ డీన్ ఆర్.రామకృష్ణ, ప్రాంగణ ఇన్‌ఛార్జి విశ్వనాథంలు విద్యార్థులతో మాట్లాడి తప్పకుండా మెస్ ఏజెన్సీ వారిపై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు నచ్చ చెప్పటంతో తాత్కాలికంగా ఆందోళన విరమించి మధ్యాహ్నం తరగతులకు హాజరయ్యారు.
No comments:
Post a Comment