ఒంగోలు ప్రకాశం న్యూస్‌టుడే :
- పోలింగ్ కేంద్రాల్లో వసతులు తక్షణమే పూర్తి
- సంయుక్త కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
సామగ్రి పంపిణీకి రంగం సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాల నోడల్ అధికారులతో గురువారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు తక్షణమే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జేసీ-2 డాక్టరు ఎ.సిరి, డీఆర్వో వి.వెంకటసుబ్బయ్య, సీపీవో డి.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఈవో టి.సుబ్బారావు, డీడీ నాగమల్లేశ్వరరావు, స్టెప్ సీఈవో బి.రవి, మెప్మా పీడీ బి.సింగయ్య, రవాణాశాఖ ఉప కమిషనర్ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment