Monday, March 18, 2019

వాణిజ్యపన్నుల అధికారుల తనిఖీలు….


విజయనగరం న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…
*అర్థరాత్రి నిర్వహించిన తనిఖిల్లో 7బండిల్స్ సీజ్…..
*ఖరీదు గల చీరలు రవాణా…..
వాణిజ్యపన్నుల శాఖాధికారులు ఆదివారం అర్థరాత్రి నిర్వహించిన తనిఖీల్లో ఎటువంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తున్న చీరలను పట్టుకొని సీజ్‌ చేశారు. వాహన తనిఖీల్లో భాగంగా ఉప సహాయక కమిష్నరు వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో వాటిని పట్టుకున్నారు. ఈ విధంగా ఏడు బండిల్స్‌ విజయనగరం రైల్వేస్టేషన్‌కు రైలులో వచ్చాయన్నారు. వాటిలో నాలుగింటిని రిక్షాలో తీసుకెళ్తుండగా పట్టుకున్నామన్నారు. వాటిని గంటస్తంభంవద్ద ఉన్న ఓ మెడికల్‌ దుకాణం పక్క వస్త్ర దుకాణానికి తరలిస్తున్నట్టు డ్రైవరు చెప్పారన్నారు. ఒక బండిల్‌లో 170 వరకు చీరలు ఉన్నాయన్నారు. వాటి విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని గుర్తించామన్నారు. తక్కువ ఖరీదు చీరలుగా పేర్కొన్నారు. రైల్వే స్టేషన్‌లో వదిలేసిన మూడు బండిల్స్‌ సీజ్‌ చేశామన్నారు. ఏసీటీఓ రామ్‌కుమార్‌ పాల్గొన్నారు.

No comments:

Post a Comment