సరదా ప్రాణం తీసింది…

0
1
సరదా ప్రాణం తీసింది…
కర్నూలు  న్యూస్‌టుడే :
  • బావిలో మునిగి ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం.
  కల్లూరు మండలం దూపాడు సమీపంలోని బావిలో ప్రమాదవశాత్తు నీట మునిగి సమరసింహారెడ్డి (20) అనే యువకుడు మృతి చెందారు. కడప జిల్లా చాపాడు మండలం బద్రిపల్లికి చెందిన రైతు, గుత్తేదారుడైన రఘురామిరెడ్డికి సమరసింహారెడ్డి ఏకైక కుమారుడు. అతను దూపాడు పరిధిలోని కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతూ వసతిగృహంలో ఉండేవారు. గురువారం అతను కళాశాలకు వెళ్లకుండా తన నలుగురు మిత్రులతో కలసి పెద్దటేకూరు సమీపంలో ఉన్న బావిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. పై నుంచి దూకడంతో ప్రమాదవశాత్తు అడుగున చిక్కుకుపోయారు. స్నేహితులు బయటకు తీసి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. ఈ ఘటనతో విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కర్నూలు చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉల్లిందకొండ ఎస్సై గోపాల్‌రెడ్డి తెలిపారు.