కావల్సినవి….
- సెనగపిండి -2 కప్పులు,
- బియ్యం పిండి అర కప్పు,
- ఉల్లిపాయలు-3,
- లేత వంకాయలు-3,
- కారం-2 చెంచాలు,
- గరం మసాల పొడి-2 చెంచాలు,
- ఉప్పు -తగినంత,
- నూనె-వేయించడానికి సరిపడ.
తయారీ విధానం……
ముందుగా ఒక బౌలు తీసుకుని అందులో సెనగపిండి,బియ్యం పిండి,ఉప్పు,కారం,మసాలా పొడి వేసి కొంచెం నీళ్లు పోసి చిక్కగా కలపాలి.తరువాత ఉల్లిపాయని గుండ్రంగా అంటే చక్రాలు మాదిరి తరిగి అలాగే వంకాయని కట్ చేసి మూకెడులో నూనె వేడి చేసి పిండిలో ఈ ముక్కలను ముంచి వేయించాలి.చిన్న మంట పెట్టి నెమ్మదిగా వేయించాలి.ఇవి రుచిగా వెరైటీగా బావుంటాయి.వేడిగా తింటే ఇంకా బావుంటాయి.
No comments:
Post a Comment