శ్రీనగర్ న్యూస్‌టుడే:
- జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఓ పౌరుడ్ని కిడ్నాప్.
- తీసుకువెళ్లి కాల్చిచంపిన ఘటన…
ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఓ పౌరుడ్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి కాల్చిచంపిన ఘటన గుల్జార్ పుర గ్రామంలో వెలుగుచూసింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని డోగ్రిపుర గ్రామానికి చెందిన మంజూర్ అహ్మద్ ను కొందరు ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి అతన్ని కాల్చి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదులు పౌరుడ్ని ఎందుకు చంపారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
No comments:
Post a Comment