కంభం న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్
2. అనారోగ్యంతో బాధపడుతూ
3. అతను శివన్నగా గుర్తించగా
నెహ్రూ నగర్‌లో నివాసముంటున్న ఉపాధ్యాయిని వెంకటలక్ష్మి,కండక్టర్ లింగపల్లి శివన్నభార్యాభర్తలు.వీరికి ఇద్దరు కుమారులు.ప్రస్తుతం శివన్నకర్నూలు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో విధులు నిర్వర్తిస్తున్నారు.కొన్నాళ్లు గా డిప్యూటేషన్‌పై శ్రీశైలం డిపోలో పని చేస్తున్నారు.శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై కంభం పరిసర ప్రాంతాలు,బంధువుల ఇళ్లలో వెతికారు.ఇదే సమయంలో కందులాపురం పంచాయతీ వీరాంజనేయనగర్ కాలనీలోని ఓ చెట్టుకు మృతదేహం వేలాడుతుండటంతో, స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.తొలుత గుర్తుతెలియని మృతదేహంగా భావించి కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అతను శివన్నగా గుర్తించగా,మృతుడి కుమారుడు అభినాష్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రంగస్వామి తెలిపారు.

No comments:
Post a Comment