Wednesday, March 20, 2019

అన్నం పరబ్రహ్మ స్వరూపం…


అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించి నమస్కరించి తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు నిందించకూడదు. ప్రశాంత వాతావరణంలో ఆహారం తీసుకోవాలి. ఎంగిలి ఎవరికి పెట్టకూడదు. అమిత భోజనం ఆరోగ్యభంగం కలిగిస్తుంది. ఎంగిలి చేత్తో బ్రాహ్మణుని, ఆవును, అగ్నిని తాకరాదు. తలకు గుడ్డచుట్టుకుని, చెప్పులు, బూట్లు వేసుకుని భుజించరాదు. దక్షిణం వైపు తిరిగి భుజించకూడదు. తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి. మంచంపైన కూర్చుని ఏవీ తినకూడదు. ఏ వస్తువునైనా ఒడిలో పెట్టుకుని తినరాదు.
                              

No comments:

Post a Comment