Monday, March 11, 2019

భట్టిప్రోలులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన…..

గుంటూరు జిల్లా: భట్టిప్రోలు:
* ప్రధాన కూడలి వీదుల్లో ప్లెక్సీలు, బ్యానర్ల తోరణాలు..
* సన్మాన సభకు హాజరుకావాలని మైక్ ప్రచారం…
  ఎన్నికల నిబంధనావళిని అధికార పార్టీ ధిక్కరిస్తుంది. ఈ నెల 22న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్  నేపధ్యంలో జిల్లాల్లో 15 రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో   ఉంది. ఈ క్రమంలోనే ఆదివారం సాధారణ ఎన్నికల షడ్యూల్ సైతం విడుదలైంది. అయినా గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం కేంద్రంలో అధికార టీడీపీ   నాయకులు ఏకంగా ప్రధాన కూడలి వీధుల్లో ప్లెక్సీలు బ్యానర్‌లు తోరణాలు     ఏర్పాటు చేశారు. మంత్రి నక్కా ఆనందబాబుకు ఆదివారం అభినందన సన్మాన సభ ఏర్పాటు చేశారు. మూడురోజులు ముందుగానే వీధుల్లో సన్మాన సభకు  హాజరు కావాలని కోరుతూ…మైక్ ప్రచారం చేపట్టారు. అంతేగాక ఆదివారం   ఉదయం నుండే గ్రామంలో ఎక్కడికక్కడ పసుపు తోరణాలను విచ్చలవిడిగ ఏర్పాటు చేసి కోడ్ ఉలంఘనకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై వైసీపీ నాయకులు జిల్లా అధికారులకు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. 

No comments:

Post a Comment