ప్రకాశం న్యూస్‌టుడే:
- ప్రైవేటు వైద్యశాలలో పరీక్షలు చేయిస్తే .
చాకిచర్లకు చెందిన గర్భిణికి సైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఆమె స్వగ్రామం మద్దిపాడు కాగా, చాకిచర్లకు చెందిన వ్యక్తితో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. భర్త ఉద్యోగ రీత్యా నెల్లూరులో ఉంటున్న ఆమె ప్రస్తుతం గర్భిణీ. దీంతో తొమ్మిది రోజుల కిందట అత్తవారిల్లు చాకిచర్ల వచ్చి, రెండు రోజులు ఉండి పుట్టినిల్లు మద్దిపాడు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత జ్వరం రావడంతో స్థానికంగా మందులు వాడినా తగ్గలేదు. దీంతో ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలో పరీక్షలు చేయిస్తే స్వైన్‌ఫ్లూ అని వైద్యులు నిర్ధరించారు. దీంతో వారు చెన్నైలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు.

No comments:
Post a Comment