Monday, March 11, 2019

నీటి కోసం మూగ జీవుల తంటాలు…

మైదుకూరు న్యూస్‌టుడే:
  *పెరుగుతున్న ఎండల వల్ల నీటి కోసం పాట్లు
  *వాగుల్లో ,వంకల్లో నీరు లేకపోవడం వలన పల్లెబాట పట్టిన జీవులు.
 కడపజిల్లా మైదుకూరులో ఓ కోతి నీటి కోసం పడినపాట్లు అలాంటివీలాంటివి కాదు.వివరాలు….. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరిగి పోవడం వలన రోడ్లపై నడవాలంటే హాడలేత్తిపోతున్నారు మనుష్యులు. అలాంటిది మూగ జీవాల పరిస్థితి ఎలా ఉంటుందో కదా!వాగులు వంకల్లో నీరు లేక పోవడంతో పల్లె బాట పడుతున్నాయి మూగజీవులు.మైదుకూరు మండలం శివపురం దళితవాడలో ఓ కోతి దప్పిక తీర్చుకునేందుకు నానాతంటాలు పడటం కంటపడింది.కుళాయిని తిప్పడం కోసం చేసే ప్రయాత్నాలన్ని విఫలమయ్యాయి.బొట్టు బొట్టుగానే పడుతున్న నీటితోనే గొంతు తడుపుకొనే ప్రయత్నం చేసింది.

No comments:

Post a Comment