Friday, March 8, 2019

యువతకు జె.నివాస్ పిలుపు…..

శ్రీకాకుళం న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
2.ఓటు అత్యంత విలువైందని.
3.ఓటు ద్వారా ఒక ప్రాంత భవితను మార్చగల శక్తి.
యువత ఓటు వేసే సమయంలో అలోచించి మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలని కలెక్టర్‌ జె.నివాస్‌ పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై, తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని సూర్యమహల్‌ కూడలి నుంచి ఏడురోడ్డు కూడలి వరకు నిర్వహించిన శోభాయాత్ర ర్యాలీని కలెక్టర్‌ నివాస్, సంయుక్త కలెక్టర్‌ కె.వి.ఎన్‌.చక్రధరబాబు జెండా ఊపి ప్రారంభించారు. సంయుక్త కలెక్టర్‌ కె.వి.ఎన్‌.చక్రధరబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని.. ఓటు ద్వారా ఒక ప్రాంత భవితను మార్చగల శక్తి ఒక్క ఓటరుకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఓటును అమ్ముకుంటే జీవితాన్ని నాశనం చేసుకున్నవారవుతారని పేర్కొన్నారు. ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు.

No comments:

Post a Comment