Saturday, March 16, 2019

వారనుకొంటే ఎంతటి నేరగాడినైనా….

కర్నూలు  న్యూస్‌టుడే :
*ఎన్నికళ వేళ ..తస్మా జాగ్రత్త……
*ఎన్నికల వేళ పోలీసులకు విశేషాధికారాలు ఉంటాయి……
*ఎంతటి నేరగాడినైనా ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉంది……
ఎన్నికల వేళ పోలీసులకు విశేషాధికారాలు ఉంటాయి. వారనుకొంటే ఎంతటి నేరగాడినైనా ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉంది. చిన్న నేరాన్నీ ఉపేక్షించకుండా కట్టడిచేస్తే దాని ఫలితం ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదవుతుంది. ఎన్నికలవేళ పోలీసుల అమ్ములపొదిలో అమరి ఉన్న అధికారాలను పరిశీలిస్తే.. సెక్షన్‌ 125(ఏ):  అభ్యర్థులు తమకు పడిన శిక్షలు..తమపై మోపిన నేరాలకు సంబంధించిన విచారణలు గోప్యంగా ఉంచటం నేరం. ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచితే శిక్షార్హమే. దీనికి ఆరునెలలు జైలు.. జరిమానా.. రెండూ విధించవచ్చు. సెక్షన్‌ 126: ఎన్నికలకు 48 గంటలలోపు ఊరేగింపులు చేయడం, సమావేశాలు నిర్వహించటం, మీడియా ప్రకటనలు ఇవ్వడం, సంగీత కచేరీలు తదితర వినోద కార్యక్రమాలు నిర్వహించటం నేరం. దీనికి రెండు సంవత్సరాల వరకూ జైలు, జరిమానా, రెండూ విధించవచ్చు.

No comments:

Post a Comment