Thursday, March 14, 2019

కొన్ని వర్గాలే లక్ష్యంగా ఓట్లు తొలగింపు……

గుంటూరు న్యూస్‌టుడే:
  • పిటిషన్ పై శుక్రవారం విచారణ.
కొన్ని వార్గాలే లక్ష్యంగా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలిగించారని, అందువల్ల 2014 నాటి పేర్లను తాజా జాబితాలో చేర్చాలని కోరుతూ హైకోర్ట్‌లో గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది. 2014 నాటి ఓటరు జాబితాతో పోల్చి చూస్తే.. ప్రస్తుత జాబితాలో కొన్ని వర్గాల పేర్లను తొలిగించినట్లు స్పష్టమవుతోందని పిటిషనర్ ఆరోపించారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 4.37 లక్షల ఓట్లు, ముస్లిం వర్గానివి 2.70 లక్షలు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓట్లు తొలగించినట్లు పిటిషనర్ ఆరోపించారు.

No comments:

Post a Comment