Thursday, March 7, 2019

కలసిమెలసి ఉండాలి….

విశాఖ న్యూస్‌టుడే:
  • వేంపాడు కొత్తూరులో రెండు వర్గాల మధ్య రోడ్డు విషయమై జరిగిన వివాదంతో తమను బహిష్కరించారంటూ ఓ వర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది…
  • గ్రామాల్లో ఎటువంటి వివాదాలకు తావులేకుండా అంతా కలిసి ఉండాలని నక్కపల్లి సీఐ ఎస్‌.విజయకుమార్‌, తహసీల్దారు టి.రామకృష్ణ సూచించారు…
రోడ్డు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి అధికారులు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక పెద్దలను పిలిచి విషయం తెలుసుకున్నారు. అనంతరం ఇరువర్గాలకు అవగాహన కల్పించారు. దశాబ్దాల తరబడి ఒకే గ్రామంలో ఇన్నాళ్లూ కలిసి ఉన్న మీరంతా తెలిసీ తెలియకుండా జరిగిన పొరపాట్లతో వివాదాలు రాజేసుకోవడం సరైనది కాదని హితవు పలికారు. ఇలాంటి వాటి కారణంగా వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. సమస్యలేమైనా ఉంటే అధికారులు, గ్రామ పెద్దల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలే తప్ప వివాదాలకు దిగడం సరికాదని సూచించారు.  గ్రామంలో అంతా కలిసి ఉంటామని ముందుకు రావడంతో మధ్యాహ్నం సామూహిక భోజనాల కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. అయినా ముందు జాగ్రత్తగా సిబ్బందిని పర్యవేక్షణ ఉంచుతామని ఎవరైనా అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామంటూ సీఐ హెచ్చరించారు.

No comments:

Post a Comment