Monday, March 11, 2019

ఖైదీ మహిళలకు చదువు అందుబాటులో …


ఒంగోలు న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్
 2.200 పుస్తకాలు బహూకరించారు
3.ఖైదీలు కూడా అందరి మనుషుల్లాంటి వారేనన్న
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తున్న సందర్భంగా సోమవారం నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం “నరసం”ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాజైలులోని మహిళా ఖైదీలకు మానసిక ఉత్తేజం కలిగించారు. కవితలు వినిపించి, పాటలు పాడి, ప్రసంగాలు చేసి, మిఠాయిలు, పండ్లు పంచి వారిని ఉత్సాహపరిచారు.ముఖ్యంగా పుస్తకాలు చదవటం వల్ల జీవితం విలువ అర్థమై తమల్నితాము.మలచుకోగలుగుతారన్నారు.ఖైదీలు కూడా అందరి మనుషుల్లాంటి వారేనన్న సంగతి మనం గుర్తుంచుకోవాలని ఆకాంక్షించారు. ఖైదీలు చదువుకునేందుకు జిల్లా జైలర్‌ రామచంద్రరావుకు రచయిత్రులు 200 పుస్తకాలు బహూకరించారు. నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, జిల్లా గౌరవాధ్యక్షురాలు వి.ఝాన్సీదుర్గ, ఉపాధ్యక్షురాలు మారేపల్లి సూర్యకుమారి, ఛైల్డ్‌లైన్‌ ప్రతినిధి సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment