Monday, March 11, 2019

మంచిగా మార్చేందుకు చేసిన ప్రయత్నం విఫలం……


కడప న్యూస్‌టుడే:
  •   మద్యం మానిపించేందుకు ఆకు పసరు.
  •   పసరు వికటించి మద్దెయ్య అనే యువకుడు మృతి.
కడప జిల్లా పోరుమామిళ్లలో విషాదం చోటుచేసుకుంది.మద్యం మానేందుకు తీసుకున్న నిర్ణయం కాటి వరకు తీసుకెళ్లింది.పోరుమామిళ్ల పట్టణానికి చెందిన మద్దెయ్య (23) అనే యువకుడు మద్యం మానేందుకు ఆకు పసరు వికటించి మృతి చెందాడు.వివారాలు……పోరుమామిళ్ల పట్టణం స్థానిక 14వ వార్డుకు చెందిన నడిపి గుర్రయ్య కుమారుడు మద్దెయ్య మద్యానికి బానిసగా మారాడు.బేల్దారి పనులు చేస్తు పని చేసిన డబ్బులన్ని మధ్యానికే ధారపోస్తున్నాడని తలిదండ్రులు మద్యం మాన్పించేందుకు ఆకు పసరు ఇప్పించారు.దీని కోసం నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతంలో సోమవారం పసరు ఇప్పించారు.ఇతనితో పాటు మరో ఇద్దరికి కూడా పసరు ఇప్పించారు.ఆపై ఇంటికి రాగానే మద్దెయ్య తీవ్ర అస్వస్థతకు గురివ్వడంతో పట్టణంలోని  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కానీ అప్పటికే మద్దెయ్య మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

No comments:

Post a Comment