బెంగుళూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు
- నటులు శారద మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.
- ఫణియమ్మ వంశవృక్షం లాంటి ప్రజాధరణ పొందిన కన్నడ సినిమాలలో నటించిన ఎల్.వి శారదా గురువారం బెంగుళూరులో కన్ను మూశారు.
- శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న శారదా నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో తుదిశ్వాస వదిలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆదిశంకరాచార్య, భూతయ్యన మగతో పాటు పలు కన్నడ సినిమాలలో శారదా ప్రముఖ పాత్రలు పోషించారు. శారద మృతి పట్ల శాండిల్‌వుడ్‌కు చెందిన నటులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు చెన్నేగౌడతో పాటు సభ్యులు తీవ్ర విచారం వ్యకతం చేశారు. దర్శకులు, నిర్మాతలతో పాటు క్యారెక్టర్ నటులు శారద మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment