Monday, March 11, 2019

తెదేపాపైనే ప్రజలకు విశ్వాసం………….

న్యూస్‌టుడే,చీపురుపల్లి:
తెలుగుదేశం పార్టీపై ప్రజలు అభిమానం, నమ్మకంతో ఉన్నారని, ఈసారి ఎన్నికల్లోనూ చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్తు శాఖా మంత్రి కిమిడి కళా వెంకటరావు అన్నారు. చీపురుపల్లి పట్టణంలో జరుగుతున్న కనకమహాలక్ష్మి ఉత్సవాలకు సోమవారం ఆయన విచ్చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.చంద్రబాబునాయుడు మళ్లీ సీఎం కావాలని, ఇందుకు చల్లటి దీవెనలు అందించాలని కనకమహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడించారు.విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబుసరత్తు  చేస్తున్నారని, ఒకటి రెండు రోజుల్లో తొలి జాబితా వస్తుందని తెలిపారు. పార్టీ పరంగా ఎక్కడైనా సమస్య ఉంటే సరిచేసి, సరైన వ్యక్తులను ఎంపిక చేసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకుంటారని చెప్పారు.
డెస్క్:గౌస్

No comments:

Post a Comment