Friday, March 8, 2019

మరో రాజకీయ వారసుడి రంగ ప్రవేశం….

ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ మీదకు మరో రాజకీయ వారసుడి రంగ ప్రవేశం జరుగుతోంది. అది కూడా సాదాసీదా పొలిటికల్ వారసత్వం కాదు. ఆ వారసుడే భరత్. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు. ఏపీ మంత్రి నారా లోకేశ్ తోడల్లుడు, గీతమ్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, దివంగత సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి మనవడే భరత్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. భరత్ కు ఇంకో హోదా కూడా ఉంది. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు కూడా భరత్ మనవడే. పుట్టుకతోనే ఘనమైన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న ఎన్నికల ద్వారా అడుగు పెట్టనున్నారనడంలో సందేహం లేదు.
                                                

No comments:

Post a Comment