సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటున్న ఏపీలోని ప్రధాన పార్టీలు టికెట్ల కేటాయింపులో మునిగి తేలుతున్నాయి. అధికార పార్టీ తెలుగుదేశం ఇప్పటికే మెజారిటీ సీట్లకు అభ్యర్థులను నిర్ణయించగా, చివరి నిమిషంలో జాబితాలో మార్పుచేర్పులతో వైసీపీ బిజీగా ఉంది. పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ కూడా లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ బుధవారం అర్ధరాత్రి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 32 మందితో కూడిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాతోపాటు లోక్‌సభలో పోటీపడే నలుగురి పేర్లను ప్రకటించారు.
No comments:
Post a Comment