Sunday, March 17, 2019

కుండపోత వర్షాలు…


జకార్త న్యూస్‌టుడే:
  • ఒక్కసారిగా విజృంభించిన వరదలు
  • 42 మంది,21 మందికి పైగా గాయాలు.
ఇండోనేషియాలో వరదలు ఒక్కసారిగా విరుచుకుపడటంతో కనీసం 42 మంది మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పపూవా ప్రావిన్స్‌లో చోటు చేసుకొంది. ఈ ప్రావిన్స్‌ రాజధాని జయపురలో కుండపోత వర్షం కురిసింది. దీంతో శనివారం ఒక్కసారిగా మెరుపువరదలుచోటుచేసుకొన్నాయి.మొత్తంతొమ్మిదిఇళ్లు,రెండువంతెనలుకొట్టుకుపోయాయి.దీంతో వెంటనే స్పందించిన నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఈ వరదల్లో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు గాలింపు బృందాలు ఘటనాస్థలానికి చేరుకోలేకపోయాయి. వరదలు వచ్చిన ప్రదేశం నుంచి నీరు వెళ్లిపోగా బురద, మట్టి, చెత్త వంటివి భారీగా వచ్చాయి. ఈ వరదల కారణంగా 120గృహాలవారు ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది.

No comments:

Post a Comment