శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే:
1)టీన్యూస్ 10 ఆన్ లైన్ ఎడిషన్……………
2)ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని , కలెక్టర్ జె.నివాస్ ఆదేశం……
3)ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల సామగ్రిని ముందురోజు తీసుకు వెళ్లాలని సూచన……
2)ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని , కలెక్టర్ జె.నివాస్ ఆదేశం……
3)ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల సామగ్రిని ముందురోజు తీసుకు వెళ్లాలని సూచన……
జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. శాసనమండలి ఎన్నికల నిర్వహణపై అధికారులకు శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల సామగ్రిని ముందురోజు తీసుకు వెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు, కెమెరాలు అనుమతించరన్నారు. మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జేసీ కె.వి.ఎన్.చక్రధరబాబు మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచించిన అన్ని నిబంధనలను ఎన్నికల అధికారులు పాటించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రం వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జేసీ-2 పి.రజనీకాంతరావు, ఆర్డీవో ఎ.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment