Sunday, March 17, 2019

అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధినం…….

కడప న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….
* అక్రమంగా రూ.6.20 లక్షల మద్యం స్వాధీనం…..
*సంబంధిత దుకాణాన్ని సీజ్‌…..
పెద్దముడియంలోని శ్రీవేంకటేశ్వర మద్యం దుకాణం నుంచి అక్రమంగా తరలిస్తుండగా సుమారు రూ.6.20 లక్షల విలువైన 155 సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మలమడుగు ఎక్సైజ్‌శాఖ సీఐ చెన్నారెడ్డి తెలిపారు. శనివారం రాత్రి కర్నూలు జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సంజామల మండలం అక్కంపల్లి గ్రామంలో మద్యం సీసాలతోపాటు అదే గ్రామానికి చెందిన శివరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన కేసును కోవెలకుంట్ల ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌లో నమోదైందని పేర్కొన్నారు. సంబంధిత దుకాణాన్ని సైతం సీజ్‌ చేశామన్నారు. అక్రమంగా మద్యం కల్గి ఉన్నా, సరఫరా చేస్తున్నా.. ఆ దుకాణాన్ని జప్తు చేస్తామని హెచ్చరించారు.

No comments:

Post a Comment