Thursday, March 14, 2019

దూసుకపోతున్న ‘ప్రియతమా’ పాట….

మజిలీ సినిమాలో నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్నారు. పెళ్లైన తరువాత తొలి సినిమాలో వీళ్లు నటించడంతో అభిమానులు ఈ మూవీపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మజిలీ చిత్రానికి సంబందించిన ఓ పాట యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రియతమా, ప్రియతమా అనే సాంగ్‌ను ఇప్పటివరకు 20 లక్షల మంది చూశారు. రెండో రోజుల క్రితమే విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ గా ఈ సాంగ్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ పాటను ఫేమస్ సింగర్ చిన్మయి శ్రీపాద పాడారు. మజిలీ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా షైన్ స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ సినిమా సమంతకు తోడుగా మరో హీరోయిన్ దివ్వాంశ కౌశిక్ నటిస్తుంది. ఏప్రిల్ 5న ఈ మూవీ విడుదల కానుంది. గురువారం సాయంత్రం ‘నా గుండెల్లో’ మూడో పాటను చిత్ర యూనిట్ విడుదల చేయనున్నట్టు సమంత తన ట్వీట్టర్ లో ట్వీట్ చేసింది.
                   

No comments:

Post a Comment